
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మేషరాశి వారికి ఈ వారం అంత శుక్రుడు శని శుభంగా ఉన్నారు. వ్యాపార పరంగ మంచి ఆదాయాన్ని పొందవచ్చు . నిరుద్యోగలు ఉద్యోగ ప్రయత్నం చేస్తే కచ్చతంగా ఫలితం లభిస్తుంది. ఆరోగ్య పరంగా కొంచం జాగ్రత వహించాలి . ఈ వారం లో శ్రమ అధికంగా ఉండవచ్చు . దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది . పలుకుబడి పెరుగుతుంది . హనుమాన్ చాలీసా పఠించండి .

వృషభం (2, 3 ,4, పా , రోహిణి , మృగశిర 1,2 పా )
వృషభరాశి వారికీ ఈ వారం అంత శుభంగా ఉన్నారు.కొంచం చికాకులు ఉంటాయి . కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతాయి . వ్యాపారాలు కలిసివస్తాయి శని,అది వారలో మంచి ఫలితాలు వస్తాయి . విద్యార్థులకు మంచి రోజులు అని చెప్పవచ్చు . ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరుగుతాయి .సంతానo మంచి అభివృద్ధి లోకి వస్తుంది . శుక్రవారం లలిత సహస్రనామామ్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మిథునం (మృగశిర 3,4 ,ఆరుద్ర,పునర్వసు 1,2,3 పా )
మిధున రాశి వారికీ ఈ వారం అంత గురు శుక్ర , రాహువు లు శుభంగా ఉన్నారు. శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది . చాల రోజుల తర్వాత అదృష్టం తలుపు కొడుతుంది . చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. గతంలో ఆగి పోయిన పనులు కూడా ఇపుడు చేయగలుగుతారు. గురు, శుక్ర వారలో శుభవార్తలు వింటారు .శివారాధన చేయండి.

కర్కాటకం (పునర్వసు 4 పా ,పుష్యమి ,అశ్లేష )
కర్కాటక రాశి వారికి రవి,శుక్రులు శుభంగా ఉన్నారు. కొంత అనుకూలత కొంత ప్రతికూలత కనిపిస్తుంది. ప్రారంభించిన పనులు కొo చం కష్టంగానే సాగుతాయి. వ్యాపారస్తులుకి మంచి ఫలితాలె వస్తాయి . ఆరోగ్యంలో కొంచం శ్రద్ధ వహించాలి . గృహంలో మార్పులు ఉంటాయి . ఇంకా మంచి ఫలితాలు కోసం గణపతి ఆరాధన చేయండి .

సింహం (ముఖ ,పుబ్బ ఉత్తర 1 వ పా)
సింహ రాశి వారికీ ఈ వారమంతా గురు,శుక్ర ,రాహు,కేతులు శుభంగా ఉన్నారు . ఉద్యోగ రంగం లో ఉన్న వారికీ వత్తిడి అనేది తప్పకపోవచ్చు . శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది . సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు . కొర్టు కు సంబందించిన విషయలలో అనుకూలమైన తీర్పులు వస్తాయి . మంగళ,బుధ వారాలలో గణపతిని,శివుడిని ప్రార్ధించండి .

కన్య (ఉత్తర 2,3,4 పా ,హస్త ,చిత్త 1,2 పా )
కన్య రాశి వారికీ ఈ వారమంతా శుక్ర ,శని శుభంగా ఉన్నారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.అనవసరమైన ఆలోచనలు చేయకండి. విద్యార్థులు కొంచం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు . ఆర్థిక సమస్యలు నుండి బయటపడతారు . విలాస జీవితం గడుపుతారు . అనుకున్న పనుల్లో విజయము. గోమాతకి నానబెట్టిన సెనగలు తినిపించండి.

తుల ( చిత్త 3,4 స్వాతి ,విశాఖ 1,2,3 పా )
ఈ వారం తులా రాశి వారికీ గురు,బుధుడు శుభంగా ఉన్నారు. వివాహం కానివారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఆదాయం పెరుగుతుంది కానీ దానికి తగినట్టు ఖర్చులూ ఉంటాయి . అవసరానికి డబ్బు అందుతుంది. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. విహారయాత్రలు చేస్తారు . ఇంకా మంచి ఫలితాలు కోసం రోజు లలిత సహస్రనామాలు చదవండి .

వృశ్చికం (విశాఖ 4 వ పా ,అనురాధ ,జేష్ఠ )
ఈ వారం రాహు,బుధ శుభంగా ఉన్నారు. రావలిసిన బాకీలు చేతికి అందుతాయి.మీరు ఆశించిన దాని కాంటెక్ ఆదాయం డబ్బులు బాగా వస్తాయి. బ్యాంకు లోన్ తీర్చే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు . ఆరోగ్యవిషయంలో జాగ్రత్త వహించాలి . సోమవారం నాడు శివాలయాన్ని దర్శించండి .

ధనస్సు ( మూల, పూర్వాషాఢ ,ఉత్తరాషాడ 1 పా )
ఈ వారం ధనస్సు రాశి వారికి గురు,శని,కేతువులు కొంత అనుకూలంగానే ఉన్నారు. మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు . వ్యాపారాలు బాగుంటాయి . విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు చేస్తే విదేశీ యోగం ఉంది. ఉద్యోగాలకు పని భారం పెరుగుతుంది. స్రిలు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు .ఇంట్లో వాతావరణం ధనస్సు రాశి వారికీ చాల అనుకూలంగా ఉంది. ఇంకా మంచి ఫలితాలకోసం దత్తాత్రేయుని ప్రార్ధించండి.

మకరం ( ఉత్తరాషాడ 2,3 ,4 పా, శ్రవణం ,ధనిష్ఠ 1,2 పా )
ఈ వారమంత బుధుడు శుభంగా ఉన్నాడు.రవి కూడా అర్ధశుభంగా ఉన్నాడు. వీళ్ళకి పెద్ద మార్పులు ఏమీలేవు . వివాహం కానివారికి వివాహ సూచనలు కనిపిస్తునాయి. ఉద్యోగా ప్రయత్నాలు అనుకూలిస్తాయి . కోర్ట్ వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆర్ధిక విషయం లో మాత్రం సంతృప్తిగా లేదు . భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటారు . అన్ని విషయంలోనూ కొంచం మౌనంగా ఉంటె మంచిది.ప్రతి రోజు నవగ్రహ
స్తోత్రాలను చదవడం మంచిది.

కుంభం ( ధనిష్ఠ 3,4 పా,శతబిషం ,పూర్వాభాద్ర 1,2,3 పా )
కుంభ రాశి వారికీ ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నారు . సోమా,మంగళ ఏ పనులు చేసిన ఆగిపోతాయి. వాహనాలు వల్ల అధికంగా డబ్బు ఖర్చుఅవుతుంది. అందుచేత దూరప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్య విష్యం లో జాగ్రత్త వహించాలి. దుబారా ఖర్చులు. వ్యాపారంలో ఉన్నవారికి బాగుంటుంది. గణేశా ప్రార్ధన. ఓం నమశ్శివాయ అని 21 సార్లు జపించాలి.

మీనం ( పూర్వాభాద్ర 4 పా ,ఉత్తరాభాద్ర ,రేవతి )
మీన రాశి వారికి ఈ వారం అంత గురువు శుభంగా ఉన్నారు. కొత్త ఇల్లు కొనడానికి ప్రయత్నo చేస్తారు. ఉద్యోగ మార్పులు ఉంటాయి. వ్యాపారాలు బాగుంటాయి. విద్యార్థులకు కాస్త కలం అని చెప్పవచ్చు. విహార యాత్రలు చేస్తారు. రోజు 11 సార్లు ఆదిత్య హృదయం చదవండి.అలాగే సోమవారం రోజు శివాలయం దర్శన చేసుకుంటేయ్ మంచిది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.