
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి ప్రతికూల ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో అనవసర వాదాలకు దూరంగా ఉండండి. ఎన్ని ఇబ్బందులు ఏర్పడిన విజయంతో ముందుకు సాగెదరు.స్త్రీలకు కుటుంబంలో కలహాలు ఏర్పడే స్థితి. విద్యార్థులకు మధ్యస్థం నుండి చెడు ఫలితం. మేషరాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం మరియు సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి

వృషభం (2, 3 ,4, పా , రోహిణి , మృగశిర 1,2 పా )
వృషభరాశి వారికి ఈ వారం అక్కరలేని అనుకోని ఖర్చుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పులు ఇవ్వడం, చేయడం మంచిది కాదని సూచన. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికం.ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

మిథునం (మృగశిర 3,4 ,ఆరుద్ర,పునర్వసు 1,2,3 పా )
మిథున రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. ద్వితీయ, తృతీయ స్థానములో ఉన్న గ్రహాల అనుకూలత వలన రవి, బుధ, శుక్రుల అనుకూలత చేత ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు, చికాకులతో కూడిన వాతావరణం.మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా ,పుష్యమి ,అశ్లేష )
అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు .ఆర్థికపరిస్థితి మేరుగ్గా ఉంటుంది.ఆస్థి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి . ఆకస్మిక విదేశీయాత్రలు చేస్తారు . వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి .

సింహం (ముఖ ,పుబ్బ ఉత్తర 1 వ పా)
సింహ రాశి వారికి ఈ వారం స్త్రీలకు అనుకూల సమయం. కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందము కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. రాజకీయరంగం, సినీరంగంవారికి మధ్యస్థం నుండి అనుకూలం. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4 పా ,హస్త ,చిత్త 1,2 పా )
ఈ వారం కన్య రాశి వారూ ఆహ్లదకరంగ ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు , వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ప్రయాణము చేసినపుడు జాగ్రతలు వహించాలి. ఆంజనేయ దండకం పఠించండి.

తుల ( చిత్త 3,4 స్వాతి ,విశాఖ 1,2,3 పా )
తులారాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి అనుకూలం. ఇష్టమైన వస్తువులు కొనెదరు. కుటుంబముతో ఆహ్లాదంగా గడిపెదరు. సినీరంగంవారికి మధ్యస్థ సమయం. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. తులారాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పా ,అనురాధ ,జేష్ఠ )
కుటుంబ మరియు ఇతర విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. మనస్సును నియంత్రించుకోవాలి. పని ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు, సంతానం వలన చికాకులు కలుగును. విద్యార్థులకు మధ్యస్థ సమయం. స్త్రీలకు చెడుఫలితాలున్నవి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనస్సు ( మూల, పూర్వాషాఢ ,ఉత్తరాషాడ 1 పా )
ధనూరాశి వారికి ఈవారం మీకు అష్టమస్థానములో రవి, శుక్రుల సంచారంచేత ఇబ్బందులు కలుగును. సంతానం వలన ఇబ్బందులు, కుటుంబములో సమస్యలు. ఆరోగ్యవిషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు స్త్రీలకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఇబ్బందులతో కూడిన వాతావరణం. చంద్రుని ప్రభావం వలన మానసిక ఆందోళనలు, ఇబ్బందులు ఏర్పడును. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి.

మకరం ( ఉత్తరాషాడ 2,3 ,4 పా, శ్రవణం ,ధనిష్ఠ 1,2 పా )
మకర రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. విద్యార్థులకు మధ్యస్థం. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. మకరరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభం ( ధనిష్ఠ 3,4 పా,శతబిషం ,పూర్వాభాద్ర 1,2,3 పా )
కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు.అనుకున్న సమయానికి ధనము అందకపోవడం. ఉద్యోగస్తులకు సమస్యలు. కళత్రస్థానములో కుజుని ప్రభావంచేత మీకు చికాకులు, సమస్యలు అధికం. ఆచితూచి వ్యవహరించాలి. అప్పులకు దూరంగా ఉండాలని సూచన. రాజకీయ ఒత్తిళ్ళు అధికము. వ్యాపారస్తులు ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మీనం ( పూర్వాభాద్ర 4 పా ,ఉత్తరాభాద్ర ,రేవతి )
మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి చెడుఫలితాలు అధికముగా ఉన్నాయి.కోర్టు సమస్యలు బాధించును. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీకు మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఏలినాటి శని వలన ఖర్చులు అధికమగును. ధనపరమైనటువంటి ఇబ్బందులు కలుగును. అప్పులివ్వరాదు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారస్తులకు చెడు ఫలితాలు. విద్యార్థులకు అనుకూలంగా లేదు.