
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మేషరాశి వారికి సోమా,మంగళ,బుధ వారలో చక్కగా పనిపూర్తి చేస్తారు.మీరు సహాయం చేసినవాల్లే మిమ్మలిని మోసం చేస్తారు.ఆ విషయం మిమ్మలిని బాధింపచేస్తుంది. మంగళ ,బుధ వారలో సతమతమవుతారు . ఆరోగ్యం బాగుంటుంది.ఆత్మీయలు నుండి సహకారం లభిస్తుంది . కొత్తగా వాహనం కొనాలిఅనుకునేవారికి గురు,శుక్ర,వారలో కలిసివస్తుంది. రోజు వారి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి.శ్రావణమంగళవారం రోజున కుంకుమ పూజ చేయించుకుంటే మంచిది.

వృషభం (2, 3 ,4, పా , రోహిణి , మృగశిర 1,2 పా )
వృషభరాశి వారికీ శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. చిన్న చిన్న మార్పులు సంభవిస్తాయి. పొట్టకి సంబందించిన అనారోగ్యము కొంచం ఈబంది పెడుతుంది. ఆందువల్ల ఆహారనియమాలు పాటించాలి . అనవసరమైన వివాదాలు లకు వెళ్ళి మీ సమయం వృధా చేయవద్దు . కొత్త పనులు మొదలు పెట్టడానికి కొన్ని రొజులు ఓపికపట్టండి. వృషభ రాశి స్రిలు మంచి బహుమతులు పొందుతారు . గణపతి ని ఆరాధించండి .

మిథునం (మృగశిర 3,4 ,ఆరుద్ర,పునర్వసు 1,2,3 పా )
మిధున రాశి వారికీ ఈ వారం శుభకార్యాలు చేకూరుతాయి . అదృష్టం కలిసివస్తోంది .ఉద్యోగప్రాప్తి . పలుకుపడిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.ఆదాయం పెరుగుతుంది. ముందు ఆగిపోయిన పనులు మళ్ళీ మంగళ ,బుధ వారలో మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి . సేవాకార్యక్రమాలో చురుకుగా పాలుగుంటారు . లక్ష్మి నారాయణం స్తోత్రమ్ చదివితె మంచిది .

కర్కాటకం (పునర్వసు 4 పా ,పుష్యమి ,అశ్లేష )
ఈ వారం అంతా కుజుడు,బుధుడు ,శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కష్టపడితే అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు కొంచం ఈబంది పడే సూచనలు కనిపిస్తున్నాయి . ఉద్యోగాలలో ఒత్తిడిలు పెరుగుతాయి.అసంతృప్తి . ఆర్ధికంగా బాగానే ఉంది .ఆదివారం సూర్యదేవా స్తోత్రాలు పఠించండి .

సింహం (ముఖ ,పుబ్బ ఉత్తర 1 వ పా)
ఈ వారం అంత అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు . స్థిర ఆస్థి ద్వారా ఆనందం పొందుతారు . అవివాహితులకు వివాహం యోగ్యం . నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. కొత్త కొత్త వస్తువులు కొంటారు . ఆరోగ్యంగా అజీర్తి సమస్యలు వస్తాయి. సుబ్రమణ్యస్వామి స్తోత్రాలు చదవండి.

కన్య (ఉత్తర 2,3,4 పా ,హస్త ,చిత్త 1,2 పా )
ఈ వారం అంత మానసికంగా బాధపడతారు .అనవసరమైన ఆలోచనలు చేయకండి. విద్యార్థులు కొంచం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి బుధ,గురు వారలో శుభవార్త వింటారు. ఆర్ధికంగా బాగుంటుంది .ఏదైనా దేవాలయానికి వెళ్లడం మంచిది .

తుల ( చిత్త 3,4 స్వాతి ,విశాఖ 1,2,3 పా )
ఈ వారం తులా రాశి వారికి రవి ,బుధ, గురు లు శుభంగా ఉన్నారు . ఆర్ధికంగా ఈబ్బoది కనిపిస్తుoది. కాలం అనుకూలంగా మారుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు . కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి . గురువారం నాడు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది . సోమవారం శివాభిషేకం చేయించడం వల్ల శుభఫలితాలు చేకూరుతాయి .

వృశ్చికం (విశాఖ 4 వ పా ,అనురాధ ,జేష్ఠ )
ఈ వారం వృచ్చిక రాశి వారికి రవి ,కుజ, బుధ, అనుకూలంగా ఉన్నారు. ఉద్యోగా ,వ్యాపారాలు కొంచం ఈబ్బoది కరంగా కనిపిస్తున్నాయి. మీరు నమ్మిన వాల్లే మిమ్మలిని మోసం చేస్తారు.ఆదాయం మంచిగా ఉంటుంది . కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. రావి చెట్టుకి 108 ప్రదక్షనలు చేయడం మంచిది.

ధనస్సు ( మూల, పూర్వాషాఢ ,ఉత్తరాషాడ 1 పా )
ఈ వారం ధనస్సు రాశి వారికి గురు,శని కేతువులు శుభoగా ఉన్నారు . ఈ వారం లో భక్తి భావన పెరుగుతుంది. విందులు ,వినోదాల్లో పాలుగుంటారు. మానసికంగా విద్యార్థి విధ్యార్దునిలు చాల ఆనందంగా ఉంటారు ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృథా ఖర్చులు చేయకండి. ఇంటాబయటా మీ నిర్ణయాలను గౌర్వయిస్తారు . వ్యాపార లాభాలు . వేంకటేశ్వరస్వామి పారాయణం చేయండి .

మకరం ( ఉత్తరాషాడ 2,3 ,4 పా, శ్రవణం ,ధనిష్ఠ 1,2 పా )
ఈ వారం మకర రాశి వారికి బుధుడు మాత్రమే శుభoగా ఉన్నారు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి గాని ఒక ఆందోళన మాత్రం మానసికంగా స్థిమితంగా ఉండనివ్వదు . నూతన ఒప్పందాలు చేసుకుంటారు . వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతంగా అవుతాయి. శనివారం శివార్చన చేయడం మంచిది .

కుంభం ( ధనిష్ఠ 3,4 పా,శతబిషం ,పూర్వాభాద్ర 1,2,3 పా )
కుంభ రాశి వారికి ఈ వారం అంత రాహువు శుభoగా ఉన్నారు.శారీరక ఈబ్బoదులు తప్పకపోవచ్చు . జీవిత భాగ్యస్వామితో కొంచం ఘర్షణలు పడవచ్చు . శుభకార్యాలు వల్ల ఖర్చులు ఐతే ఉంటాయి . నూతన వస్తు లాభలు ఉంటాయి . ఆలోచించి నిర్ణయాలూ తీసుకోవడం మంచిది . పలుకుబడి పెరుగుతుంది . కుటుంభంతో సంతోషంగా ఉంటారు .సుబ్రమణ్య స్వామి దేవాలయాని దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీనం ( పూర్వాభాద్ర 4 పా ,ఉత్తరాభాద్ర ,రేవతి )
మీన రాశి వారికి ఈ వారం అంత బుధుడు ,గురువు ,శుక్రువు శుభoగా ఉన్నారు.ఆస్తి సంభందమైనా పనులులో విజయం సాధిస్తారు . కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా అసంతృప్తి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది . ఉద్యోగ పరంగా పరవాలేదు . విదేశాలకు వెళ్లాలనే వాళ్ళకి మంచి సమయం కాదు .. దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది .మంగళవారo నాడు సుబ్రమణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించండి .