
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మేష రాశి వారికీ ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి ఆధిపత్యం పెరుగుతుంది.కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంతా మీకు అనుకూలంగానే పూర్తవుతుంది. ప్రస్తుతానికి ఎక్కడా తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆచితూచి అడుగులు వేసే ధోరణి మంచిది. వ్యాపారాల్లో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.శివాలయాన్ని దర్శించండి లేదా ఓం నమశ్శివాయ అని 21 సార్లు జపించండి.

వృషభం (2, 3 ,4, పా , రోహిణి , మృగశిర 1,2 పా )
వృషభరాశి వారికీ ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి.ఈ వారం నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు.కొందరు మిత్రులకు అండగా నిలబడతారు.కుమారస్వామి లెదా సుబ్రహ్మణ్యంస్వామి స్తోత్రాలు చదవండి.

మిథునం (మృగశిర 3,4 ,ఆరుద్ర,పునర్వసు 1,2,3 పా )
మిధున రాశి వారికీ ఈ వారం ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు.ఆదాయంలో పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదు.వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి.
చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి.గణేశా ప్రార్ధన .

కర్కాటకం (పునర్వసు 4 పా ,పుష్యమి ,అశ్లేష )
కర్కాటక రాశి ఈ వారం ఇంటా బయటా కొన్ని చిరాకులు ఉన్నప్పటికీ, నిదానంగా బాధ్యతలను నెరవేరుస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కూడా పని భారం పెరిగే అవకాశం ఉంది. ఆదాయం కలిసి వస్తుంది కానీ, సంతృప్తికరంగా ఉండదు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు సామరస్యంగా సాగిపోతుంది.సాయిబాబా ప్రార్ధన .

సింహం (ముఖ ,పుబ్బ ఉత్తర 1 వ పా)
సింహ రాశి వారు ఈ వారం అనుకోకుండా ధన యోగం పడుతుంది. సేవా కార్యక్రమాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ ప్రముఖులతో కలిసి పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఆశిం చిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి. కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పవు వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా ,హస్త ,చిత్త 1,2 పా )
కన్య రాశి వారికీ ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమస్యలుండే అవకాశం ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దుర్గాదేవిని పూజించండి .

తుల ( చిత్త 3,4 స్వాతి ,విశాఖ 1,2,3 పా )
తులా రాశి వారికీ ఈ వారం ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిత్రులు సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో పనులలో శ్రమ అధికమౌతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి

వృశ్చికం (విశాఖ 4 వ పా ,అనురాధ ,జేష్ఠ )
వృశ్చిక రాశి వారికీ ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి ప్రయణాలలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో మిత్రులతో కలహా సూచనలున్నవి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.ఆదిత్య హృదయం చదవండి.

ధనస్సు ( మూల, పూర్వాషాఢ ,ఉత్తరాషాడ 1 పా )
ధనుస్సు రాశి వారికీ ఈ వారం సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. సేవా, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజ కీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరు గుతుంది. కుటుంబ సమేతంగా కొన్ని ముఖ్యమైన ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రుల వల్ల సమస్యలుంటాయి.శివారాధన .

మకరం ( ఉత్తరాషాడ 2,3 ,4 పా, శ్రవణం ,ధనిష్ఠ 1,2 పా )
మకరరాశి వారికీ ఈ వారం ఉద్యోగంలో అధికారులు మీ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో తిప్పట తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు కానీ, దానధర్మాలకు లోటుండదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త కార్య క్రమాలు చేపడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.ఆంజనేయ ప్రార్ధన .

కుంభం ( ధనిష్ఠ 3,4 పా,శతబిషం ,పూర్వాభాద్ర 1,2,3 పా )
కుంభ రాసి వారికీ ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలగుతుంది. అన్ని వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప దన వ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు. మిత్రులతో అకారణ కలహ సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.

మీనం ( పూర్వాభాద్ర 4 పా ,ఉత్తరాభాద్ర ,రేవతి )
మీనా రాశి వారికీ ఈ వరం వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు.రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు.గణేశా పార్ధన .
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.