
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మేషరాశి వారు ఈ వారం సకాలంలో పనులు పనిపూర్తి చేస్తారు.వృత్తి ,ఉద్యోగ్య పరంగా బాగుంది .ఆరోగ్యము బాగుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కి మంచి రోజులు అని చెప్పవచ్చు అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తారు . ఐశ్వర్య పాప్తి . గురువారం రోజు మేధా దక్షిణామూర్తిని దర్శించుకోండి.

వృషభం (2, 3 ,4, పా , రోహిణి , మృగశిర 1,2 పా )
వృషభరాశి వారికీ ఈ వారం చంద్ర బలం అధికంగా ఉండడం కారణంగా మనశాంతిగా ఉంటారు . స్థానమార్పులు కనిపిస్తున్నాయి ఉద్యోగ మారడం లేదా ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది . అనవసరమైన ప్రయాణాలు మాను కుంటే మంచిది ,ప్రయాణాల్లో జాగ్రతలు వహించాలి . శుభకార్యలలో పాల్గుoటారు కొత్త వ్యక్తుల పరిచయాలు. ఇంకా మంచి ఫలితాలికి విష్ణుసహాశ్రనామ స్తోత్రం పఠించండి .

మిథునం (మృగశిర 3,4 ,ఆరుద్ర,పునర్వసు 1,2,3 పా )
మిధున రాశి వారికీ ఈ వారం కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాల పరిధి విస్తరించే అవకాశం ఉంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.మంగళవారం సుబ్రమణ్యస్వామి ని దర్శించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు .

కర్కాటకం (పునర్వసు 4 పా ,పుష్యమి ,అశ్లేష )
ఈ వారం కర్కాటకం రాశి వారికీ వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అను కూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు.ఆరోగ్యంగా బాగానే ఉంటుంది కానీ చిన్నగా ఖర్చులు ఉంటాయి. అదృష్టసంఖ్య 5. సోమవారం నాడు పంచాక్షరి ,బిల్వాష్టకం పఠించండి .

సింహం (ముఖ ,పుబ్బ ఉత్తర 1 వ పా)
ఈ వారం మీకు నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సూర్యదేవుడిని పూజించండి ఆదిత్య హృదయం పఠించండి .

కన్య (ఉత్తర 2,3,4 పా ,హస్త ,చిత్త 1,2 పా )
ఈ వారం కన్య రాశి వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి తగ్గుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.దూరపు బంధువులతో సఖ్యత. కోపంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుపోవడం మంచిది. రుద్రకవచ స్తోత్రాన్ని లేదా దక్షిణామూర్తి స్తోత్రాలిని పఠించండి.

తుల ( చిత్త 3,4 స్వాతి ,విశాఖ 1,2,3 పా )
ఈ వారం మీరు ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు.విలాస జీవితం ధన వ్యయం . అనవసర పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి, వ్యాపారాలో బాగా అభివృద్ధి చెందుతాయి. సుబ్రమణ్యస్వామి ని ఆరాధించండి .

వృశ్చికం (విశాఖ 4 వ పా ,అనురాధ ,జేష్ఠ )
ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి.కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.స్థిరాస్తి లాభం. కాళభైరవ లేదా శివారాధన చేయండి .

ధనస్సు ( మూల, పూర్వాషాఢ ,ఉత్తరాషాడ 1 పా )
ఈ వారం ధనస్సు రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్య ఉండదు.కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు, ప్రయత్నాలు సకాలంలో పూర్తిచేస్తారు . కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థుల్లో చదువుల పట్ల బాగా శ్రద్ధ పెరుగుతుంది.కలిసివచ్చే రోజు శుక్రవారం . శుక్రవారం రోజు లలిత సాహస్ర నామ స్తోత్రలిని పఠించండి.

మకరం ( ఉత్తరాషాడ 2,3 ,4 పా, శ్రవణం ,ధనిష్ఠ 1,2 పా )
ఈ వారం నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి.వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వివిధ రంగాలకు చెందిన వారికి ఆదాయం పెరు గుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి ప్రాధాన్యం పెరుగుతుంది.మంగళవారం మరియు శనివారాల్లో ఆంజనేయస్వామి ని దర్శించుకొనడం వల్ల మంచి అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు .

కుంభం ( ధనిష్ఠ 3,4 పా,శతబిషం ,పూర్వాభాద్ర 1,2,3 పా )
ఈ వారం కుంభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడ తారు.ఆరోగ్యం బాగానే ఉంటుంది.వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి.చాల కాలంగా మానసిక ప్రశాంతంగా ఉంటారు. కృషికి తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబసభ్యులు సహకారం అందుతుంది. చిన్న చిన్న సమస్యలు పెద్దగా అవకముందే జాగ్రత వహించండి. మరింత ఫలితాల కోసం ఆంజనేయుని దర్శించుకోండి .

మీనం ( పూర్వాభాద్ర 4 పా ,ఉత్తరాభాద్ర ,రేవతి )
మీన రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది.కుటుంభంతో సఖ్యత సంతోషాలు . కుటుంభంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు . అందరి మన్నన పొందుతారు . అదృష్ట సంఖ్య 4. ఆంజనేయుని సిందూరం పెట్టుకోండి.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.